పులివెందులలో వైసీపీ ప్రేరేపిత హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలి: నాదెండ్ల మనోహర్
Advertisement
- పులివెందులలో జరిగిన హింస వైసీపీ ప్రేరేపితమేనన్న మంత్రి నాదెండ్ల
- ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ
- స్థానిక ఎన్నికలు శాంతియుతంగా జరగాలన్నదే కూటమి లక్ష్యమని వెల్లడి
- గతంలో లాగా ఏకగ్రీవాల కోసం అరాచకాలు ఉండవని స్పష్టీకరణ
- పులివెందుల ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపు
Advertisement
రాష్ట్రంలో అలజడులు సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శించారు. పులివెందులలో శనివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఘటనను ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. "గత ఐదేళ్ల పాలనలో ప్రజలను భయపెట్టిన వైసీపీ, ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించడం దురదృష్టకరం. అల్లర్లతో లబ్ధి పొందాలనేది వారి కుట్రపూరిత ఆలోచన" అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని భావిస్తోందని మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా నామినేషన్లు వేయనివ్వకుండా, ఏకగ్రీవాల కోసం అరాచకాలు సృష్టించే పద్ధతికి స్వస్తి పలికి, ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పులివెందులలో వైసీపీ ప్రేరేపణతో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.